త్వరలో గ్రూప్స్ 1,2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
గ్రూప్స్ 1,2 పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతి

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 1,2 పోస్టుల భర్తిక ఆర్ధిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రూప్-1లో 110 పోస్టులు, గ్రూప్-2లో 182 పోస్టులు భర్తీ చేయనున్నారు. జాబ్ కాలెండర్లో ప్రకటించిన పోస్టుల కంటే అధికంగా పోస్టులు భర్తీ చేయాలని ఇటీవల సిఎం జగన్ ఆదేశించారు. దీంతో గ్రూప్స్ 1,2 విభాగాలలో మొత్తం 292 ఉద్యోగాలను ప్రకటించారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది.