ఎపిలో స్టాఫ్‌నర్స్ పోస్టులకు నోటిఫికేషన్
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/STAFF-NURSES-POSTS.jpg)
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖలో స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిన 957 స్టాఫ్‌నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు నేటి నుండి 8వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులను రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల ఆధారంగా మెరిట్‌లిస్ట్‌ను 19వ తేదీన, సెలక్షన్ లిస్ట్‌ను 20న తీస్తారు. ఈ నెల 21,22 తేదీల్లో కౌన్సెలింగ్, అపాంట్‌మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు.