ఎపిపిఎస్‌సి లో 730 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎపిపిఎస్‌సి 730 పోస్టుల భ‌ర్తీకి మంగ‌ళ‌వారం నోటిఫికేష‌న్ విడుద‌లచేసింది. ఎపి రెవెన్యూ శాఖ‌లో 670 జూనియ‌ర్ సిస్టెంట్ క‌మ్‌ కంప్యూట‌ర్ అసిస్టెంట్ పోస్టులు, దేవాదాయ శాఖ‌లో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అభ్య‌ర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు 18 ఏళ్ల నుండి 42 ఏళ్ల వ‌య‌స్సు మ‌ధ్య ఉండాలి.జిల్లా క‌లెక్ట‌ర్ నిర్వ‌హించే కంప్యూట‌ర్ ప్రొఫిషియెన్సీ (స్క్రీనింగ్ టెస్ట్‌, మెయిన్ వెగ్జామినేష‌న్‌) టెస్టు ఉత్తీర్ణుల‌వ్వాల్సి ఉంటుంది. అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తులు చివ‌రి తేది జ‌న‌వరి 19 వ‌ర‌కు ఉంది. మిగిలిన వివ‌రాల‌కు https://psc.ap.gov.in వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.