టిఎస్‌పిఎస్‌సి నుండి 833 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లోని 833 ఇంజినీరింగ్ ఉద్యోగాలకు టిఎస్‌పిఎస్‌సి ప్రకటన జారీ చేసింది. అసెస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 29 నుండి అక్టోర్ 21వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి సమాచారం కొరకు https//www.tspsc.gov.in/ వెబ్‌సైట్ చూడవచ్చు.