సింగ‌రేణిలో 177 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్

కొత్త‌గూడెం (CLiC2NEWS): సింగ‌రేణి సంస్థ‌లో త్వ‌ర‌లో 177 క్ల‌రిక‌ల్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుందని ఆ సంస్థ డైరెక్ట‌ర్ ఎన్ బ‌ల‌రాం తెలిపారు. సోమ‌వారం కొత్త‌గూడెంలోని ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆయ‌న మాట్లాడారు. సింగరేణి లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు ఆయ‌న తెలిపారు. త్వరలోనే 177 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని, పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

గతేడాది సింగరేణి సంస్థ సాధించిన నికర లాభం వివరాలను ఈ నెల 25న నిర్వహించనున్న బోర్డు సమావేశంలో ప్రకటించే అవకాశముందని బలరాం తెలిపారు. లాభాల్లో కార్మికుల వాటా విషయమై సిఎం, సంస్థ సీఎండీ దసరా లోపు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.