ఎపిలో నవంబర్ 13 దీపావళి సెలవు.. సిఎస్ ఉత్తర్వులు

అమరావతి (CLiC2NEWS): ఈ ఏడాది దీపావళి పండుగ 12వ తేదీ ఆదివారం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి పండుగ సెలవును 13వ తేదీకి మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 12 ఆదివారం దీపావళి పండుగ కాగా.. నవంబర్ 13వ తేదీ ఆప్షనల్ హాలిడే బదులుగా సాధారణ సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది.