ఇక వ‌రంగల్‌, హ‌న్మ‌కొండ జిల్లాలు

వరంగల్‌ (CLiC2NEWS): వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల పేర్ల మార్పు ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గురువారం తుది నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాగా, వరంగల్‌ అర్బన్‌ జిల్లా పేరును హన్మకొండగా, వరంగల్‌ రూరల్‌ జిల్లా పేరును వరంగల్‌ జిల్లాగా పేర్లు మార్చుతూ ప్రభుత్వం తుది నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీంతో 15 మండలాలతో వరంగల్‌ జిల్లా, 12 మండలాలతో హన్మకొండ జిల్లా ఏర్పాటయ్యాయి. జూన్‌ 21న వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సమయంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అభ్యంతరాలు, సలహాలు ఇవ్వాలంటూ గత నెల 12న ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ నోటిఫికేషన్‌ గడువు ఈ నెల 10వ తేదీన ముగిసింది. అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన అనంతరం జిల్లాల పేర్ల మార్పును ప్రకటించింది. ఈ మార్పుపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందిస్తూ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

హ‌న్మ‌కొండ జిల్లాలోని 12 మండ‌లాలు :
హ‌న్మ‌కొండ‌, కాజీపేట‌, ఐన‌వోలు, హ‌స‌న్‌ప‌ర్తి, వేలేరు, ధ‌ర్మ‌సాగ‌ర్‌, ఎల్క‌తుర్తి, భీమ‌దేవ‌ర‌ప‌ల్లి, క‌మాలాపూర్‌, ప‌ర‌కాల‌, న‌డికూడ‌, దామెర‌.

వ‌రంగ‌ల్ జిల్లాలోని 15 మండ‌లాలు:
వ‌రంగ‌ల్‌, ఖిలావ‌రంగ‌ల్‌, గీసుగొండ‌, ఆత్మ‌కూరు, శాయంపేట‌, వ‌ర్ధ‌న్న‌పేట‌, రాయ‌ప‌ర్తి, ప‌ర్వ‌త‌గిరి, సంగెం, న‌ర్సంపేట‌, చెన్నారావుపేట‌, న‌ల్ల‌బెల్లి, దుగ్గొండి, ఖానాపూర్‌, నెక్కొండ‌.

Leave A Reply

Your email address will not be published.