AP: ఎన్‌టిపిసి రూ.1.87 కోట్లు పెట్టుబ‌డి..సిఎం స‌మ‌క్షంలో ఒప్పందం 

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ప‌లు సంస్థ‌లు ముందుకొస్తున్నాయి.  ఈ క్ర‌మంలో ఎన్‌టిపిసి భారీ పెట్టుబ‌డి పెట్టుందుకు స‌ర్కార్‌తో ఒప్పంద కుదుర్చుకుంది. సిఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో రాష్ట్ర ప్ర‌భుత్వ భాగస్వామ్యంతో పున‌రుత్పాద‌క రంగంలో ప్రాజెక్టులు పెట్టుందుకు  ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా వ‌చ్చే 25 ఏళ్ల‌లో రాష్ట్రానికి రూ. 20,620 కోట్ల ఆదాయం రానుంది. ల‌క్ష మంద‌కిపైగా ఉద్యోగావ‌కాశాలు రానున్న‌ట్లు సమాచారం. ఎపి ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎన‌ర్జి పాల‌సీతో  స‌త్ఫ‌లితాలు ఉంటాయ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇటీవ‌ల రిల‌య‌న్స్ గ్రూప్ ఎపిలో ఆధునిక బయోగ్యాస్ ప్లాంట్‌ల‌కు గాను రూ.65వేల కోట్లు పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌భుత్వంతో అవగాహ‌న ఒప్పందం కుదుర్చుకుంది.

రూ.40వేల కోట్ల‌తో టాటాప‌వ‌ర్ ప్రాజెక్టులు: సిఎం చంద్ర‌బాబు

ఎపిలో రూ.65 వేల కోట్లు పెట్టుబ‌డి పెట్టేందుకు రిల‌య‌న్స్ సిద్దం

Leave A Reply

Your email address will not be published.