ఎన్టీఆర్ స్మారక రూ. 100 నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/ntr-coin.jpg)
న్యూఢిల్లీ (CLiC2NEWS):నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ. 100 స్మారక నాణేన్ని ఇవాళ (సోమవారం) రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, ఎన్టీఆర్ కుమార్తెలు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.