పునీత్ భౌతిక కాయానికి ఎన్టీఆర్ నివాళులు..
బెంగళూరు (CLiC2NEWS): తన ప్రాణ స్నేహితుడు, కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఆయన శనివారం ఉదయం బెంగళూరుకు చేరుకుని కంఠీరవ మైదానంలో శ్రద్ధాంజలి ఘటించారు. పునీత్ పార్థివదేహాన్ని చూస్తూ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం తారక్‌ని చూసిన పునీత్ సోదరుడు శివ రాజ్‌కుమార్ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు ప్రశాంత్‌నీల్ పునీత్‌కు నివాళులర్పించారు.
ఇప్పటికే బాలకృష్ణ శనివారం ఉదయం కంఠీరవ స్టేడియానికి వెళ్లి పునీత్‌కు నివాళులర్పించారు. పునీత్ పార్థివదేహాన్ని చూసి భావోద్వేగానికి గురైన ఆయన కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం పునీత్ సోదరుడు శివరాజ్‌కుమార్‌ని పరామర్శించారు. బాలకృష్ణతోపాటు నరేశ్, శివబాలాజీ, ప్రభుదేవా సైతం నివాళులర్పించారు.