నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మళ్లీ నుమాయిష్ సందడి?
హైదరాబాద్ (CLiC2NEWS): నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రతి సంవత్సరం నుమాయిష్ నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే. కరోనా మహమ్మారి మూలంగా కిందటి సంవత్సరంల నుమాయిష్‌ను నిర్వాహకులు నిలిపివేశారు. ఈ సంవత్సరంల కరోనా కేసులు తగ్గుముఖం పడటంతో నుమాయిష్‌ను నిర్వహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో వచ్చే జనవరిలో నుమాయిష్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి బీ ప్రభాశంకర్ తెలిపారు.