దేశంలో 1700కి చేరిన ఒమిక్రాన్ కేసులు

ఢిల్లి (CLiC2NEWS): దేశంలో క‌రోనా విజృంభిస్తోంది. గ‌త కొన్నాళ్లుగా ఏడువేల లోపు వ‌స్తున్న కొవిడ్ కేసులు ఒక్క‌సారిగా పెరుగుతున్నాయి. నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల త‌ర్వాత ఈ పెరుగుద‌ల వేగం మ‌రింత పెరిగింది. సోమ‌వారం దేశంలో క‌రోనా కేసులు 33వేలు న‌మోద‌య్యాయి. వారం రోజుల వ్యవ‌ధిలో ఐదు రెట్లు పెరిగింద‌ని, ఇది కొత్త వేరియంట్ సామాజిక వ్యాప్తిని సూచిస్తోందని నిపుణులు వెల్ల‌డించారు. ఇక దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 175 కొత్త కేసులు నిర్థార‌ణ కాగా.. ఒమిక్రాన్ కేసులు సంఖ్య 1700కి చేరింది. 639 మంది ఒమిక్రాన్ నుండి కోలుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.