మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ నోటిఫికేషన్..
లెప్ట్నెంట్ హోదాలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. బిఎస్సి, ఎమ్మెస్సి నర్సింగ్ చేసిన మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ మిలటరీ నర్సింగ్ సర్వీస్ పరీక్ష ద్వారా ఈ పోస్టులకు ఎంపిక కావచ్చు. ఎంపికైన వారికి ప్రారంభ వేతనం నెలకు రూ. 56,100 నుండి రూ. 1,77,500 వరకు ఉంటుంది. ముందుగా ఐదేళ్ల సర్వీసుకు నియామంకం జరుగుతుంది. తర్వాత మరో ఐదేళ్లకు పొడిగిస్తారు. అనంతరం అభ్యర్థుల ఆసక్తిన భట్టి మరో నాలుగేళ్లు సర్వీసు పొడిగింపు ఉంటుంది. 2023 సంవత్సరం నాటికి 35 ఏళ్లకు మించరాదు. డిసెంబర్ 26వ తేదీ లోపు దరఖాస్తులను ఆన్లైన్లో పంపించాలి. 2014 జనవరి 14న పరీక్ష నిర్వహిస్తారు. ఎపి తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, హైదరాబాద్. అభ్యర్థులు పూర్తి సమాచారం కొరకు https://exams.nta.ac.in/SSCMNS వెబ్సైట్ చూడగలరు.
మిలటరీ నర్సింగ్ సర్వీస్‌కు ఎంపికైన వారు.. దేశ వ్యాప్తంగా ఆర్మి, నేవి, ఎయిర్ఫోర్స్లకు చెందిన సైనిక శిబారాల్లో, ఆర్మీ మెడికల్ హాస్పిటల్స్లోను, త్రివిధ దళాలకు సంబందించి యేస్ క్యాంప్‌లలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.