సంచనం.. తొలిటెస్టులో కివీస్‌పై బంగ్లా విజయం
మౌంట్ మంగనుయి (CLiC2NEWS): టెస్టు క్రికెట్‌లో వరల్డ్ ఛాంపియన్ కు నిజంగా షాక్.. న్యూజీలాండ్‌తో జరుగుతున్న తొలిటెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ సంచలన విజయం నమోదు చేసింది. దీంతో క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది.
మౌంట్ మంగనుయిలో జరిగిన తొలిటెస్టు మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో న్యూజీలాండ్‌పై బంగ్లాదేశ్ విజయం సాధించింది. కేవలం 40 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న కివీస్ ర్యాంకింగ్‌లో 9వ స్థానంలో ఉన్న బంగ్లా చేతిలో సొంతగడ్డడపై తొలిసారి ఓటిమి పాలయింది. ఈ విజయంతో 2 టెస్టుల సరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యాన్ని సాధిచింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్ ఇబాదత్ హుస్సేన్ తన బౌలింగ్‌లో అద్భుత ప్రతిభకనబర్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసి విజయంలో కీలకభూమిక పోషించాడు.