ఓ బుడతా..ఇక నీదే ఘనత

అంద మైన లోకం

అనుభవాల సారం

చూడాలిరా బుడత

భువిపైన జనత నడత

నా వయసు తరుగుతుంది

నీ వయసు పెరుగుతుంది

బుజిబుజి నవ్వుల బుజ్జాయి

లోకంపోకడ తెలియని పాపాయి

కథలన్నీ నమ్మకు

నమ్ముకున్న ధ్యేయం విడువకు

భీరుకుడికా జీవించకు

ధీరుడిగా నడు మున్ముందుకు

నీవే భావి జనత

దక్కుతుంది నీకే ఘనత

-ఎస్.వి రమణా చారి
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు

1 Comment
  1. Social Media Marketing says

    Wow, incredible blog format! How long have you been blogging for? you made running a blog look easy. The overall look of your site is excellent, as neatly as the content material!!

Leave A Reply

Your email address will not be published.