AUS vs SA: సఫారీలపై కంగారుల విజయం
భారత్ తో ఆసీస్ ఫైనల్ పోరు ఖరారు
కోల్‌కత్తా (CLiC2NEWS): మూడు వికెట్ల తేడాతో ఫైనల్‌కు ఆసీస్. 213 పరుగుల లక్ష్యంలో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు విజయం సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా జట్టు 212 పరుగులకు ఆలౌటయింది. ఆసీస్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్ 62, డేవిడ్ వార్నర్ 19 జోష్ 28, స్టీవ్ స్మిత్ 30, లబుషేన్ 18 పరుగులు చేశారు. ఈ సెమీస్‌లో గెలిచిన కంగారుల జట్టు ఫైనల్‌లో భారత్‌తో తలపడనుంది.
దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటయింది. హెన్రిచ్ క్లాసెస్ 47, డేవిడ్ మిల్లర్ 101 పరుగులు సాధించారు.
AUS vs SA: వన్డే ప్రపంచకప్ రెండో సెమీస్
IND vs NZ: కివీస్‌పై భారత్ గెలుపు