నేడే వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్.. ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?
ఆహ్మాదాబాద్ (CLiC2NEWS): యావత్తు భారత ప్రజలంతా ప్రపంచకప్ ఫైనల్‌మ్యాచ్‌లో టీమ్ ఇండియా ‘కప్’ గెలవాలని కోరుకుంటుంది. ఈ రోజు ఆహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆసీస్ జట్లు ఫైనల్ మ్యాచ్‌కు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు భారత్ గెలవాలంటూ ప్రార్థిస్తున్నారు. అయితే ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ ఉంటుందో తెలుసా.. 40లక్షల డాలర్లను ప్రైజ్‌మనీగా ఐసిసి ఇవ్వనుంది. ఇది మన రూపాయిల్లో దాదాపు రూ. 33 కోట్లు. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 20 లక్షల డాలర్లు. అంటే దాదాపు రూ. 16.50 కోట్లు వస్తాయి.
ప్రపంచకప్ టోర్నమెంట్ మొత్తం ప్రైజ్ మనీ 10 మిలియన్ డాలర్లుగా ఉంది. అంటే దాదాపు రూ.83.29 కోట్లు. దీంట్లో టైటిల్ గెలిచిన వారికి 40 లక్షల డాలర్లు, రన్నరప్‌గా నిలిచినవారికి 20 లక్షల డాలర్లు. సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయిన జట్లకు 8 లక్షల డాలర్లు అందజేస్తారు. ఇవిగాక లీగ్ దశలో ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు 40,000 డాలర్లు చొప్పున వస్తాయి. ఇక లీగ్ దశలోనే బయటకు వెళ్లిన ఒక్కో జట్టుకు లక్ష డాలర్లు చొప్పున అందిస్తారు.