నేడు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 తొలి సెమీస్‌..

భార‌త్, న్యూజిలాండ్ సెమీస్ పోరు..

World Cup (CLiC2NEWS) : నేడు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో తొలి సెమీ ఫైన‌ల్ మ్యాచ్ భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ముంబ‌యిలోని వాంఖ‌డే మైదానం ఈ మ్యాచ్‌కు వేదిక‌కానుంది. ఈ మ్యాచ్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టివ‌ర‌కు టీమ్ ఇండియా వాంఖ‌డే మైదానంలో చాలా మ్యాచ్‌లు ఆడారు. ముగ్గురు భార‌త క్రికెట‌ర్లు త‌మ హోం గ్రౌండ్‌లో ఆడ‌నుండ‌టం గ‌మ‌నార్హం. రోహిత్ శ్రేయ‌స్‌, సూర్య‌కుమార్ యాద‌వ్ .. కుటుంబ స‌భ్యులు, అభిమానులు భారీగా స్టేడియంలో ఉండే అవ‌కాశాలు ఉన్నాయి.

భార‌త్‌కు ఇది ఎనిమిద‌వ సెమీస్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ ఏడు సార్లు సెమీస్‌కు వ‌చ్చి.. మూడు సార్లు మాత్ర‌మే ఫైన‌ల్‌కు చేరింది. దానిలో రెండు సార్లు విశ్వ విజేత‌గా నిలిచింది. 1983లో ఇంగ్లాండ్‌తో సెమీ ఫైన‌ల్, ఫైన‌ల్లో వెస్టిండీస్‌ను ఓడించి క‌పిల్ సేన తొలిసారి ప్ర‌పంచ‌క‌ప్ అందుకుంది.
1987లో కూడా సెమీస్‌లో అడుగు పెట్టిన భార‌త్‌ వాంఖ‌డే మైదానంలో ఇగ్లాండ్ చేతిలో ఓడిపోయి వెనుదిరిగింది. 1996లో సెమీఫైన‌ల్‌కు అర్హ‌త సాధించి శ్రీ‌లంక చేతిలో ఓట‌మిపాలైంది. ఈడెన్ గార్డెన్‌లో జ‌రిగిన ఈ మ్యాచ్‌కు తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. ప్రేక్ష‌కులు సీట్ల‌కు నిప్పంటించ‌డంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేసి శ్రీ‌లంకను విజేత‌గా ప్ర‌క‌టించారు.

2003లో సెమీస్‌లోకి అడుగు పెట్టిన భార‌త్ కెన్యాను ఓడించింది. కానీ ఫైన‌ల్‌మ్యాచ్‌లో అస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 2011లో తిరిగి ధోని సేన మ‌రోసారి వ‌ర‌ల్డ్ క‌ప్ చేజిక్కించుకుంది. సెమీస్‌లో పాకిస్థాన్‌పై గెలిచి.. ఫైన‌ల్లో శ్రీ‌లంక‌పై విజ‌యం సొంతం చేసుకుంది.
2015 భార‌త్ జ‌ట్టు ధోని సారథ్యంలో సెమీస్‌కు చేరింది. కానీ అస్ట్లేలియా చేతిలో పర‌జ‌యం చవిచూసింది. 2019లో కేవ‌లం 18 ప‌రుగుల తేడీతో న్యూజిలాండ్ చేతిలో కోహ్లీ సేన సెమీస్‌లో వెనుదిరిగింది. ఇపుడు న్యూజిలాండ్‌తో జ‌ర‌గ‌బోమే సెమీస్‌పై క్రికెట్ అభిమానులలో తీవ్ర‌ ఉత్కంఠ నెల‌కొంది.

వాంఖ‌డే మైదానంలో ఈ ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌లో చాలా మ్యాచ్‌లు జ‌రిగాయి. ప్ర‌తి సారి ముందుగా బ్యాటింగ్ చేసిన ప్ర‌తి జ‌ట్టూ భారీ స్కోర్ న‌మోదు చేసింది. శ్రీ‌లంక, భార‌త్ మ‌ధ్య జ‌రిగిన పోరులో భార‌త్ 357/8 ప‌రుగులు చేసింది. ఇక ఇక్క‌డ రెండు మ్యాచ్‌లు ఆడి ఓడిన ద‌క్షిణాఫ్రికా.. ఇంగ్లాండ్‌పై 399/ 7, బంగ్లాదేశ్‌పై 382 పరుగులు చేసింది.

Leave A Reply

Your email address will not be published.