ఒడిశా రైలు దుర్ఘటన.. రంగంలోకి సిబిఐ
న్యూఢిల్లీ (CLiC2NEWS): ఒడిశా రైలు ప్రమాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ మొదలు పెట్టింది. ఇవాళ (మంగళవారం) ఉయదం 10 మంది సిబిఐ అధికారులు బలాసోర్‌లోని ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్ర పోలీసులు సేరించిన ఆధారాలు, ఇతర వివరాలను సిబిఐ అధికారులు పరిశీలించారు.
రైలు ప్రమాదానికి కారమైన పలు అభియోగాలతో పోలీసులు ఎఫ్ ఐ ఆర్ ను నమోదు చేశారు. రైళ్లు సురక్షితంగా నడపడంలో కీలకమైన “ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ“ లో మార్పుల వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది.
ఈ ఘోర ప్రమాదంలో మృతి చెందిన వారు 278కి పెరిగినట్లు ఒడిశా రాష్ట్ర సర్కారు ప్రకటించింది. కాగా మృతి చెందిన వారిలో సగానికి పైగా మృతదేహాలను బంధువులకు అప్పగించారు. కాగా ఇంకా 101 మృతదేహాలు ఎవరివనేది తెలియరాలేదు. ఇప్పటి వరకు వారి కోసం బంధువులెవరు రాలేదు.. దాంతో మృతదేహాలను భద్రపరచేందుకు ఆసుపత్రి వర్గాలకు, అధికారులకు సవాలుగా మారింది. దాంతో అధికారులు మృతదేహాల ఫోటోలను ప్రత్యేక వెబ్‌సైట్లో పొందుపరచారు. ఈ వెబ్‌సైట్ ద్వారా తమ వారి ఆచూకీ గుర్తించవచ్చని ఇండియన్ రైల్వే ప్రజలకు విజ్ఞప్తి చేసింది.