శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి… గేట్లు తెరిచేందుకు అధికారులు సన్నద్ధం!
శ్రీశైలం (CLiC2NEWS): ఎగువన కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జురాల ప్రాజెక్టు నుంచి దాదాపు 3 లక్షల క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 1.40 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాయశయానికి వచ్చి చేరుతోంది. దాంతో అధికారులు కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి 60, 977 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 872,60 అడులకు చేరింది. ఈ క్రమంలో మరో 13 అడుగు మేర నీటిమట్టం పెరిగితే శ్రీశైలం ప్రాజక్టు పూర్తి స్థాయికి చేరుకుంటుంది. దీంతో ఈ నెల 30వ తేదీన శ్రీశైలం గేట్లు తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.