ఉక్రెయిన్‌లో చమురు పైప్‌లైన్ పేల్చివేత..
ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఖర్కీవ్ నగరాన్ని రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయి. అక్కడి సహజవాయు పైప్‌లైన్‌ను పేల్చివేశాయి. దీంతో భారీ ఎత్తున మంటలు వ్యాయించాయి. పర్యావరణంపై దీని ప్రభావం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యాతో చర్చలకు సిద్ధమేనన్నారు. కానీ రష్యా ప్రతిపాదించినట్లు చర్యలకు సిద్ధమే గానీ రష్యాసూచించినట్లు బెలారస్ అయితే అంగీకరించమని అన్నారు. ప్రస్తుతం రష్యా బెలారస్ నుండే తమ దేశంపై దాడి చేస్తున్న విషయం గుర్తుచేశారు. బెలారస్ తప్ప మరి ఏ ఇతర దేశం నుంచైనా తాము చర్చలకు సిద్ధమన్నారు.