ఇంధన ట్యాంకర్‌ను ఢీకొట్టిన వాహనం.. 91 మంది దుర్మరణం

ఫ్రీటౌన్‌ (CLiC2NEWS): ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్‌లో ఘోర దుర్ఘటన చోటు చేసుకున్నది. ఇంధన ట్యాంకర్‌ను మరో వాహనం బ‌లంగా ఢీకొన‌డంతో భారీ పేలుడు సంభ‌వించి 91 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్ర‌మాదంలో మంటలు చెలరేగకముందే ఇంధనం చుట్టుప‌క్క‌ల‌కు చిందటం జ‌రిగింది. దాంతో రద్దీగా ఉండే జంక్షన్‌లో జ‌ర‌గ‌డంతో పక్కనే ఉన్నవారు మరియు వాహనాలను మంట‌లు చుట్టుముట్టాయి. స్థానిక మీడియా సంస్థలు ప్రసారం చేసిన ఫుటేజీలో ట్యాంకర్ చుట్టూ ఉన్న వీధుల్లో బాగా కాలిపోయిన మృతదేహాలు కనిపించాయి.

ఈ ప్ర‌మాదంలో మ‌రో 100 మంది వ‌ర‌కు తీవ్రంగా గాయ‌ప‌డ్డ‌రు. వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని సియెర్రా లియోన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డీఎంఏ) కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మహ్మద్ లామరానే బాహ్ తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఫ్రీటౌన్‌ నగరంలో రద్దీగా ఉండే జంక్షన్‌ వద్ద భారీ ఆయిల్‌ ట్యాంకర్‌ను మరో వాహనం ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది.

ప్రెసిడెంట్ జూలియస్ మాడా బయో మాట్లాడుతూ “విషాదకరమైన మంటలు మరియు భయంకరమైన ప్రాణనష్టం వల్ల తాను చాలా కలత చెందానుష‌. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ ఘటనపై ప్రెసిడెంట్‌ జూలియస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.