7 తులాల బంగారం కోసం వృద్ధిరాలిని నరికిన వైనం
అనంతపురం జిల్లాలో దారుణం..
గార్లదిన్నె (CLiC2NEWS): అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 7 తులాల బంగారం కోసం ఓ వృద్ధురాలిని కిరాతకంగా నరికేశారు. ఈ ఘటన జిల్లాలోని గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగుంట్ల గ్రామంలో ఓబుల్మ్మ అనే వృద్దురాలు ఒంటరిగా ఉంటుంది. ఆమె కుమార్తె హైదరాబాద్‌లో స్థిరపడింది. గ్రామానకి చెందిన కృష్ణ మూర్తి ఇంట్లో శుభకార్యం నిమిత్తం దాదాపు 7 తులాల బంగారు నగలు ఓబులమ్మ ఇచ్చింది. 15 రోజులు గడిచిన తర్వాత కూడా నగలు తిరిగి ఇవ్వలేదు. దీంతో ఓబులమ్మ స్థానికులను ఆశ్రయించింది. ఈ విషయంలో ఆగ్రహించిన కృష్ణమూర్తి కుటుంబసభ్యులు శుక్రవారం ఓబులమ్మతో గొడవపడి గొడ్డలితో నరికి చంపారు. శరీర భాగాలను ముక్కలు చేసి పెనకచర్ల డ్యామ్‌లో పడేశారు. వృద్దురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి.. డ్యామ్ నుండి మృతదేహాన్ని బయటకు తీశారు.