లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక..
Om Birla elected as Lok Sabha Speaker..
ఢిల్లీ (CLiC2NEWS): బిజెపి ఎంపి ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 48 ఏళ్ల తర్వాత స్పీకర్ పదవికి తొలిసారి ఎన్నిక నిర్వహించారు. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఓంబిర్లా ఇండియా కూటమి అభ్యర్థిపై విజయం సాధించి.. 18వ లోక్‌సభాపతిగా ఎన్నికయ్యారు.
లోక్‌సభలో సభ్యుల పదవీస్వీకారం అనంతరం బుధవారం స్పీకర్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. లోక్‌సభాపతి పదవిపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో స్పీకర్ ఎన్నిక ప్రక్రియ బుధవారం నిర్వహించారు. సభాపతిగా ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని మోడీ తీర్మానం ప్రవేశపట్టారు. అటు ఇండియా కూటమి తరపున కె. సురేశ్ పేరును శివసేన ఎంపి అరవింద్ సావంత్ తీర్మానం తీసుకొచ్చారు. దీనిని పలువురు విపక్ష నేతలు బలపరిచారు. మూజువాణీ పద్దతిలో ఓటింగ్ చేపట్టగా.. ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు.