జమ్మూ కశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా..

శ్రీనగర్ (CLiC2NEWS): జమ్మూకశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం చేయనున్నారు. లెప్ట్నెంట్ గరవర్నర్ మనోజ్ సిన్హా .. ఈ నెల 16వ తేదీన ప్రమాణ స్వీకారానికి ఒమర్‌ను ఆహ్వానించారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఈ క్రమంలో ఎన్‌సి శాసనసభాపక్షనేతగా ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.