భారత్‌లో 578 కి చేరిన ఒమిక్రాన్ కేసులు..
ఢిల్లీలో 142, మహారాష్ట్రలో 141 ఒమిక్రాన్ కేసులు

ఢిల్లి (CLiC2NEWS): దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఒక్కరోజులో 156 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో ఒమిక్రాన్ కేసులు మొత్తం 578 కి చేరినవి. కాగా.. వీరిలో 151 మంది ఒమిక్రాన్ బాధితులు కోలుకున్నారిని సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు దేశంలో మొతం 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ వ్యాపించింది.
ఢిల్లీలో 142, మహారాష్ట్రలో 141 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కేరళ 57, గుజరాత్ 49, రాజస్థాన్ 43, తెలంగాణ 41, తమిల్‌నాడు 34, కర్ణాటక 31, మధ్యప్రదేశ్ 9, ఆంధ్రప్రదేశ్ 6, వెస్ట్‌బెంగాల్ 6, హర్యానా 4, ఒడిస్సా 4, ఛండీగడ్ 3, జమ్ము అండ్ కాశ్మీర్ 3, ఉత్తర్ ప్రదేశ్ 2, హిమాచల ప్రదేశ్, లఢఖ్, ఉత్తరాఖండ్లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.