Tirumala: ఈ నెల 22న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
![](https://clic2news.com/wp-content/uploads/2022/08/ttd-devotees-traffic.jpg)
తిరుమల (CLiC2NEWS): శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రకటనలో తెలిపింది. మార్చి, ఏప్రిల్, మే నెల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు ఉన్నట్లు తెలిపింది. ఈ (మార్చి, ఏప్రిల్, మే) నెలల్లో మిగతా ఆర్జిత సేవా టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ ఈ నెల 22న ఉదయం 10గంటల నుండి 24 వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందిన వారు రుసుము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాలను గమనించి భక్తులు టికెట్లు బుక్ చేసుకోవాలని టిటిడి అధికారులు వెల్లడించారు.