వాహ‌న‌దారుల‌కు శుభ‌వార్త‌..

ఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర‌ప్ర‌భుత్వం పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించింది. లోక్‌స‌భ ఎన్నిక‌లు సమీపిస్తున్న వేళ కేంద్రం వాహ‌న‌దారుల‌కు ఊర‌ట క‌లిగే ప్ర‌క‌ట‌న చేసింది. పెట్రోల్, డీజిల్ పై లీట‌ర‌కు రూ. 2 చొప్ప‌న త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. చ‌మురు మార్కెటింగ్ కంపెనీలు స‌వ‌రించిన ఈ ధ‌ర‌లు శుక్ర‌వారం ఉద‌యం 6 గంట‌ల నుండి అమ‌లులోకి రానున్నాయి. దీంతో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర ఢిల్లీలో రూ. 94.72.. ముంబ‌యిలో రూ. 104.21గా ఉంది. చెన్నైలో రూ. 100.75 ఉన్న పెట్రోల్ ధ‌ర .. కోల్‌క‌తాలో రూ. 103.94గా ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.