Good News: సిలిండర్‌పై రూ. 200 తగ్గింపు
ఎల్పీజి వినియో దారులకు శుభవార్త
న్యూఢిల్లీ (CLiC2NEWS): రక్షాబంధన్ వేళ మహిళలకు ప్రధాని మోడీ సర్కార్ శుభవార్త చెప్పింది. గృహోపయోగ ఎల్ పి జి సిలిండర్‌పై రూ. 200 లచొప్పున తగ్గించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తగ్గించిన ఎల్పిజి ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. రక్షా బంధన్ వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలో దాదాపు 30 కోట్ల మంది వినియోగ దారులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 1103 గా ఉంది. తగ్గిన ధరలో రూ. 903కి తగ్గనుంది. అలాగే ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు రూ. 400 తగ్గనుంది. కాగా దేశంలోని మహిళలకు ప్రధాని నరేంద్ర మోడీ రక్షబంధన్ కానుక అని మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు.