ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీపై రూ. 50వేల జరిమానా..!
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనల్లో సవరణలు
![](https://clic2news.com/wp-content/uploads/2022/06/PLASTIC-BAN-ALL-OVER-INDIA.jpg)
అమరావతి (CLiC2NEWS): సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు విధించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టిక్ ఉత్పత్తుల దిగుమతి, తయారీపై మొదటిసారి తప్పుగా పరిగణిస్తే రూ. 50వేలు, రెండోసారి రూ.లక్ష జరిమానా విధించనుంది. ప్లాస్టిక్ వినియోగంపూ పట్టణ, పల్లెల్లో సహితం మున్సిపల్ కమిషనర్లు, సంచాయతీరాజ్ శాఖ అధికారులు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది దృష్టి సారించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనల్లో సవరణలు చేస్తూ.. పాలిథిన్ క్యారీ బ్యాగుల ఉత్పత్తి, విక్రయాలు, వినియోగం.. ఈ కారమర్స్ కంపెనీలపైనా దృష్టి పెట్లాలని ఎపి కాలుష్య నియంత్రణ మండలికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్లాస్టిక్ స్టాక్ చేసినా, పంపిణీ చేసినా రూ. 25 వేల నుండి రూ. 50వేల వరకు డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో జరిమానా విధిస్తారు. వీధి వ్యాపారలు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వినియోగిస్తే రూ. 2,500 నుండి రూ. 5 వేల వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది. షాప్స్, సంస్థలు, మాల్స్ తదితర ప్రదేశాల్లో వాటిని విక్రయిస్తే రూ. 20 వేల నుండి 40 వేల వరకు జరిమానా విధించనున్నట్లు అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.