పద్మశ్రీ రామచంద్రయ్యకు రూ. కోటి ప్రకటించిన సిఎం కెసిఆర్..

హైదరాబాద్ (CLiC2NEWS): పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన డోలు వాద్యకారుడు రామచంద్రయ్యకు సిఎం కెసిఆర్ భారీ సాయం అందించారు. కొత్తగూడెంలో ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం కోటి రూపాయలు నజరానా ప్రకటించారు. ఇటీవల రామచంద్రయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్యశ్రీ ప్రకటించిన విషయంల తెలిసినదే. రామచంద్రయ్య ఈరోజు ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ను కలిశారు. ఆదివాసీ కళను బతికిస్తున్నందుకు రామచంద్రయ్యను సిఎం అభినందించారు.
అదేవిధంగా గత సంవత్సరం పద్మశ్రీ అవార్డు అందుకున్న గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు కూడ సిఎం కెసిఆర్ కోటి రూపాయలు ప్రకటించారు.