వరద సహాయక చర్యలకు ఎస్‌బిఐ ఉద్యోగుల భారీ విరాళం

హైదరాబాద్ (CLiC2NEWS): వరద బాధితుల సహాయార్థం ఎస్‌బిఐ ఉద్యోగులు భారీ విరాళం ప్రకటించారు. తమ ఒక రోజు వేతనం రూ. 5కోట్లు విరాళం సిఎం సహాయనిధికి అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎస్‌బిఐ సిజిఎం చెక్‌ను అందజేశారు. అటు తెలంగాణ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం రూ.100 కోట్లు, ఆంధ్ర ఉద్యోగులు 120 కోట్లు సిఎం సహాయ నిధికి అందించారు. తెలుగు రాష్ట్రాలల్లో వరదలు కారణంగా అనేకమంది ప్రజలు నిరాశ్రయులైన సంగతి తెలిసిందే. ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పలు సినీ . రాజకీయ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు.