అయోధ్యకు తిరుమల నుండి లక్ష లడ్డూలు

తిరుమల (CLiC2NEWS): ఈ నెల 22 వ తేదీన అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్బంగా తిరుమల నుండి లక్షలడ్డూలు శ్రీవారి ప్రసాదంగా పంపించనున్నట్లు సమాచారం. ఒక్కో లడ్డూ..25 గ్రాములు చొప్పున లక్ష లడ్డూలను భక్తుల కోసం పంపించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఏర్పాట్లు చేస్తుంది. దీనికోసం తిరుమలలోని శ్రీవారి సేవాసదన్-1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్లో రెండు లడ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. ఇలా మొత్తంగా 350 బాక్సులను సిద్దం చేసినట్లు సమాచారం.