ఒక్క క్షణం గుర్తొచ్చారు..

ఒక్క క్షణం గుర్తొచ్చారు…
కనుల నిండుగా.. కన్నుల పండుగగా
కనిపించే నా పాత విద్యార్థులు..
వారు కూర్చున్న బల్లల సాక్షిగా…
వారి కోసం నేను వాడిన నల్లబల్ల సాక్షిగా…
నిజంగా…
ఒక్క క్షణం గుర్తొచ్చారు…
మనసు తెరచి…కనులు తరచి చూస్తే…
హృదయం మోయలేని చిరు భారం గా…
అక్షరాలు పలికే…పలికించే నా స్వరం
మూగదయింది ఆ క్షణం…
మరుక్షణమే సవరించుకున్నాను
నా స్వరాన్ని…
సమయం లోనికి తిరిగి వచ్చేసాను…
ఆ పాత మధురానుభూతులను…
అందమయిన జ్ఞాపకాలుగా దాచుకుంటూ…
మనసు తలుపులు మూసివేసి…
కనులు మాత్రం తెరచి చూస్తే…
మళ్లీ నా కర్తవ్యం గుర్తు చేస్తూ
మరో తరం విద్యార్థుల ఎదురుచూపులు…
గతం నించి ఒక్కసారిగా….
వర్తమానం లోనికి వచ్చేస్తూ…ఈ క్షణం….
-కవితాశరణ్
ప్రభుత్వ ఉపాధ్యాయురాలు
జడ్‌పిఎస్ఎస్, కౌటాల, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా