Amaravathi: రాజ‌ధాని ఉద్య‌మం మొద‌ల‌య్యి వెయ్యి రోజులు..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎపి రాజ‌ధాని  అమ‌రావ‌తియే ఉండాల‌ని  రాజ‌ధాని ఉద్య‌మం మొద‌ల‌య్యి వెయ్యి రోజులు కావ‌స్తున్న త‌రుణంలో రైతులు మ‌హాపాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు. ఉద్య‌మం ప్రారంభించి సెప్టెంబ‌ర్ 12వ తేదీకి వెయ్యి రోజులు పూర్త‌వుతాయి.  ఈ సంద‌ర్బంగా రైతులు మ‌హా పాద‌యాత్ర‌కు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌క‌పోతే కోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని ఐకాస నేతలు అంటున్నారు. అమ‌రావతియే ఏకైక రాజ‌ధాని అంటూ గుంటూరులో మొద‌లు పెట్టిన  నాన్ పొలిటిక‌ల్ జెఎసి ఆధ్వ‌ర్యంలో సైకిల్ యాత్ర వెంక‌ట‌పాలెంలో ముగిసింది. ఈ సైకిల్ యాత్ర‌లో వైద్యులు, న్యాయ‌వాదులు, ఇత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు పాల్గొన్నారు. వీరంతా అమ‌రావ‌తికి మ‌ద్ద‌తుగా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు. అంతేకాకుండా రైతులు చేప‌ట్టే మ‌హాపాద‌యాత్ర‌లో పాల్గొంటామ‌ని, వారికి అండ‌గా ఉంటామ‌ని అన్నారు.   శ్రీవెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యం వ‌ద్ద సైకిల్ యాత్ర చేసిన వారికి ఘ‌నంగా స్వాగ‌తం ల‌భించింది.

Leave A Reply

Your email address will not be published.