ప్ర‌తి 2వేల జ‌నాభాకు ఒక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్: కృష్ణ‌బాబు

అమ‌రావ‌తి (CLiC2NEWS): బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తుల అవ‌యువ‌దానానికి వారి కుటుంబ స‌భ్యుల‌ను మాన‌సికంగా సిద్ధం చేయాల‌ని ఎపి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు అన్నారు. మంగ‌ళ‌గిరిలోని ఎన్ ఆర్ఐ ఆస్ప‌త్రిలో నిర్వ‌హించిన జీవ‌న్‌దాన్ వ‌ర్క్‌షాప్‌కు ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. ట్రాన్స్ ప్లాంట్ కో-ఆర్డినేట‌ర్లుగా శిక్ష‌ణ పొందిన వారికి ధ్రువ‌ప‌త్రాల‌ను అంద‌జేశారు. అవ‌యువ‌దానంపై ట్రాన్స్ ప్లాంట్ కో-ఆర్డినేట‌ర్లు ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. జీవ‌న్ దాన్ కార్య‌క్ర‌మం కింద హార్వెస్టెడ్ ఆర్గాన్స్ అన్నింటిని ఎపి ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు మాత్ర‌మే వినియోగించాల‌ని కృష్ణ‌బాబు సూచించారు.

రాష్ట్రంలో 16 కొత్త మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌తోపాటు మ‌రో 16 మ‌ల్టీ స్పెషాలిటి హెల్త్ హ‌బ్‌లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. వైద్య‌, ఆరోగ్య‌రంగానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని పేర్కొన్నారు. ప్ర‌తీ 2వేల జ‌నాభాకు ఒక వైఎస్ ఆర్ హెల్త్ క్లినిక్ అందుబాటులో ఉండేలా రాష్ట్రంలో 10వేల‌కు పైగా వైఎస్ ఆర్ హెల్త్ క్లినిక్‌లు అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.