కేరళలో కొనసాగుతున్న కరోనా ఉధృతి
తిరువనంతపురం (CLiC2NEWS): కేరళలో గతకొన్ని రోజులనుండి 20వేలకుపైగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో నమోదయ్యే కొవిడ్ కేసులలో సగానికి పైగా కేరళలోనే నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటలలో 36,401 కరోనా కేసులు నమోదుకాగా.. కేరళ రాష్ట్రంలో 20,224 పాజిటివ్ కేసులు నిర్ధారణయ్యాయి. కరోనా మహమ్మారితో 99 మంది మరణించారు. దేశంలో కేరళ కరోనా హాట్‌స్పాట్‌గా కొనసాగుతుంది.