కొనసాగుతోన్న మా ఎన్నికలు

మా ఎన్నికలు ఇవాళ (ఆదివారం) హైదరాబాద్‌లోనిజూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో జ‌రుగుతున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటలనుండి మొదలయిన ఎన్నిక‌లు మధ్యాహ్నం 2 గంటలవరకు ఎన్నికలు జరగనున్నాయి. 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాల్ని కూడా ఇదే రోజు ప్రకటించనున్నారు. ఆదివారం రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

కాగా ‘మా’లో మొత్తం 925 మంది సభ్యులు ఉన్నారు. ఇవాళ జ‌రుగున్న ఎన్నిక‌ల్లో ఎంతమంది పోలింగ్ కేంద్రానికి వస్తారో చూడాలి.

మొద‌టి ఓటు పవన్‌ కళ్యాణ్‌దే..

ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌యిన మా అధ్యక్ష ఎన్నికల్లో తొలి ఓటును పవన్‌ కళ్యాణ్‌ వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండస్ట్రీ ఎట్టి పరిస్థితుల్లో చీలిపోదని, నిజానికి మా అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవంగా జరగాల్సి ఉండాలని పవన్‌ అభిప్రాయపడ్డారు. ఆయ‌న మాట్లాడుతూ.. ‘తిప్పి కొడితే 900 ఓట్లు ఉన్నాయి. దీనికోసం వ్యక్తిగత దూషణలు అవసరమా’ అని ప‌వ‌న్ ప్రశ్నించారు. సినిమాలు చేసే వాళ్లు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి కానీ.. ఇలాంటి వ్యక్తిగత దూషణలు ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయన్నారు. ఇక మోహన్ బాబు , చిరంజీవి ఇద్ద‌రు మంచి ఫ్రెండ్స్‌ అని తెలిపారు.

చిరంజీవి..

ఓటు వేసిన అనంత‌రం బయటకు వచ్చిన చిరంజీవిని మీడియా `మా ఎన్నికలు ఇంత ప్రతిష్టాత్మకంగా జరగడంపై ఎలా స్పందిస్తున్నారు?` అని ప్ర‌శించ‌గా చిరంజీవి స్పందిస్తూ.. `పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక్కోసారి మారుతోన్న పరిస్థితులకు అనుగుణంగా సమాయత్తం కావాల్సి ఉంటుంది. మీ మీడియాకు మంచి మెటిరియల్‌ దొరికింది కదా.. ఈ పరిస్థితిలో ఆనంద పడాలి కదా. అని చమత్కరించారు. ఎక్కువ శాతం కళాకారులు ఎవరిని ఎన్నుకుంటే వారికే నా మద్ధతు అని చిరంజివి తెలిపారు.

బాలకృష్ణ‌

ఓటు హక్కును వినియోగించుకున్న అనంత‌రం నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.. ఎవరు ఇండస్ట్రీకి మేలు చేస్తారో వారికే ఓటేశాను. ఇద్దరూ ఇండస్ట్రీకి బాగా చేసేలా కనిపిస్తున్నారని తలిపారు. దీంతో రెండు ప్యానెల్లో ఉన్న వారికి ఓటు వేశాన‌ని తెలిపారు. ప్రకాశ్‌ రాజ్‌, తమ్ముడు విష్ణు ఇండస్ట్రీకి అన్నదమ్ముళ్ల లాంటి వారే అని తెలిపారు. రేపు షూటింగ్‌లలో మళ్లీ కలిసి పని చేసుకునే వాళ్లమేనని గుర్తు చేశారు. తెలిపారు. మా అసోసియేష‌న్ సభ్యులకు ఎలాంటి అవసరాలున్నావారికి సహాయం అందించే బాధ్యత మా ఎన్నికల్లో గెలిచిన వారిదే బాధ్యత కాదని, ఇండస్ట్రీలోని అందరిపై ఆ బాధ్యత ఉందని బాల‌కృష్ణ తెలిపారు.

నాగార్జున

కింగ్‌ నాగార్జు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జెనీలియా
ఓటు హక్కు వినియోగించుకోవడానికి నటి జెనీలియా ముంబయి నుంచి వచ్చారు. ఓటు వేసిన అనంత‌రం జెనిలీయా మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీ నాకు సొంతిల్లు అని తెలిపారు.

రోజా
వైసీపీ ఎమ్మెల్యే, నటి రోజా తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంత‌రం మాట్లాడుతూ.. మంచి వాతవారణంలో ఎన్నిక జరుగుతుండడం ఆనందంగా ఉంది. ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా.. అందరం కలిసి కట్టుగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో మన సమస్యలను పరిష్కరించేలా ముందుకు వెళ్లాలని రోజా తెలిపారు.

సాయి కుమార్‌
నటుడు సాయి కుమార్ ఓటు హ‌క్కు వినియోగించుకున్న అనంత‌రం మాట్లాడుతూ సాధారణ ఎన్నికల స్థాయిలో మా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. తాను కూడా పోటీ చేయాలనుకున్నాడని కానీ షూటింగ్‌లో బిజీ ఉండడంతో పోటీలో లేనని చెప్పుకొచ్చాడు.

రామ్‌ చరణ్‌..
మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. చెర్రీతో పాటు ఇప్పటి వరకు ఎవరెవరు ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో.. మంచు లక్ష్మి, శ్రీకాంత్, నరేష్, శివబాలాజీ, ఉత్తేజ్, సుడిగాలి సుధీర్, మహర్షి రాఘవ, సాయి వెంకట్, ఖయ్యుమ్, వేణు, శాంతి శ్రీ హరి భార్య, ఈటీవీ ప్రభాకర్, సీనియ‌ర్ న‌టి రాశీ, నటి పూనమ్‌కౌర్‌ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.