కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ షురూ..

ఢిల్లీ (CLiC2NEWS): 2023-24 విద్యాసంవత్సరానికి గాను కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు మొదలయ్యాయి. 1వ తరగతి నుండి 11వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదలయ్యింది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యాలయాల్లో మార్చి 27వ తేదీనుండి ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలయ్యింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చే నెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ఒకటో తరగతిలో ప్రవేశం కోసం చిన్నారుల వయస్సు మార్చి 31 నాటికి ఆరేళ్లు పూర్తి కావల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి ప్రాథమిక.. వెయిటింగ్ మొదటి లిస్టును ఏప్రిల్ 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 21 నుండి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రెండో తరగతి నుండి ఆపై తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఏప్రిల్ 3వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. https://kvsonlineadmission.kvs.gov.in/index.html వెబ్‌సైట్ ద్వారా ఆన్ లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు.