మేడారం జాతరకు ఆన్‌లైన్ సేవలు..

హైదరాబాద్ (CLiC2NEWS): మేడారం జాతరకు ఆన్‌లైన్‌లో మొక్కులు చెల్లించుకునేందుకు దేవాదాయశాఖ వీలు కల్పించింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం ప్రారంభించారు. జాతరకు వెళ్లలేని వారు సమ్మక్క సారలమ్మకు సమర్పించే బంగారం ఆన్‌లైన్‌లో చెల్లించేకునే విధంగా ఏర్పాట్లు చేసింది. మీ సేవ, పోస్టాఫీసు, టియాప్ ఫోలియో ద్వారా భక్తులు వారి బరువు ప్రకారం కిలోకు రూ. 60 చొప్పున చెల్లించి నిలువెత్తు బంగారం సమర్పణ సేవను బుక్‌చేసుకోవచ్చు. ప్రసాదం సైతం తపాలా శాఖ ద్వారా పొందే అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.