ఇజ్రాయెల్ నుండి రెండో విడతలో 235 మంది స్వాదేశానికి..

ఢిల్లీ (CLiC2NEWS): ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్ నుండి భారతీయులను రెండో విడత 235 మందిని స్వాదేశానికి తీసుకువచ్చారు. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య జరుగుతున్న దాడుల కారణంగా ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అపరేషన్ అజయ్‌ను కేంద్రప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసందే. శుక్రవారం తొలి విడతగా 212 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకోగా.. తాజాగా 235 మంది స్వదేశానికి చేరుకున్నారు.
తమను క్షేమంగా భారత్‌కు తీసుకొచ్చినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా ఇజ్రాయెల్‌లో మొత్తం దాదాపుగా 18 వేల మంది భారతీయులున్నారు. వీరిలో కేర్టేకర్లు, విద్యార్థులు, ఐటి ఉద్యోగులు, వజ్రాల వ్యాపారులు ఉన్నారు. వీరిలో కేర్టేకర్లుగా సుమారు 14 వేల మంది ఉన్నట్లు సమాచారం.