ఆప‌రేష‌న్ సిందూర్‌..

పాక్ ఉగ్రస్థావ‌రాల‌పై భార‌త్ మెరుపు దాడులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): భార‌త్ ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడికి ప్ర‌తీకార చ‌ర్య‌లు చేప‌ట్టింది. మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి 1.44 గంట‌ల‌కు పాకిస్థాన్‌లోని ఉగ్ర‌స్థావ‌రాల‌పై భార‌త్ మెరుపు దాడులు చేసింది. ఈ మెరుపు దాడుల‌ను `ఆప‌రేష‌న్ సిందూర్‌` పేరుతో భార‌త త్రివిద ద‌ళాలు.. ఇండియ‌న్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌, నేవీ బ‌ల‌గాలు సంయుక్తంగా నిర్వ‌హించాయి.

పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్‌, పాక్‌లోని ఉగ్ర‌స్థావ‌రాల‌పై భార‌త్ ద‌ళాలు మిసైళ్ల‌తో విరుచుకు ప‌డ్డాయి. ఈ దాడులు పాక్‌లోని 9 ఉగ్ర‌స్థావ‌రాలు ల‌క్ష్యంగా దాడులు నిర్వ‌హించింది. ఈ అటాక్ లో 80 నుంచి 100 మంది వ‌ర‌కు ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించి ఉంటార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ దాడులు ముఖ్యంగా బ‌వ‌ల్పూర్ (జైషే మ‌హ‌మ్మ‌ద్‌), మురిద్కే (ల‌ష్క‌రే తొయిబా) స్థావ‌రాల‌పై జ‌రిగాయి. ఈ స్థావ‌రాల్లోనే అత్య‌ధిక మంది ఉగ్ర‌వాదులు చ‌నిపోయి ఉంటార‌ని తెలుస్తోంది. పాక్ సైనిక స‌దుపాయాల‌పై ఎక్క‌డా దాడులు జ‌ర‌గలేద‌ని భార‌త స‌ర్కార్ పేర్కొంది.

 

Leave A Reply

Your email address will not be published.