Ramagundam: పోలీస్ సిబ్బందికి కంటి వైద్య శిబిరం

రామగుండం  పోలీస్ క‌మిష‌న‌రేట్‌ (CLiC2NEWS):  క‌మిష‌న‌ర్‌ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు డ్రైవర్స్ గా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కంటి వైద్య బిరం నిర్వ‌హించారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలో డ్రైవ‌ర్స్‌గా ఉన్న‌టువంటి 85 మంది సిబ్బందికి రామ‌గుండం క‌మిష‌న‌రేట్ హెడ్ క్వార్ట‌ర్స్ ఆవ‌ర‌ణ‌లో కంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. దీంతో పాటు బిపి, షుగ‌ర్ బిఎమ్ ఐ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా ఎసిపి మాట్లాడుతూ.. డ్రైవర్ పై ఆధారపడి ఆ వాహనంలో అందరి ప్రాణాలు ఆధారపడి ఉంటాయని.. శరీర భాగాలు అన్ని ముఖ్యమైనవే, అందులో కళ్ళు అతి ముఖ్యం. దానిలో డ్రైవర్స్ కి కంటి చూపు బాగుండడం అతిముఖ్యమ‌ని అన్నారు. ఈ కంటి వైద్య శిబిరాన్ని అంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.