ముంబయిలో ఆరెంజ్ అలర్ట్..
![](https://clic2news.com/wp-content/uploads/2022/07/mumbai-rains.jpg)
ముంబయి (CLiC2NEWS): దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో భారీగా కురిసిన వర్షాలతో వరదలు ముంచెత్తాయి. రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరద నీరు రోడ్లపైకి చేరడంతో ముంబయిలో రహదారులు చెరువును తలపిస్తున్నాయి. రైలు పట్టాలపైకి నీరు చేరడంతో పలు రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. ఈ వర్షాలు శుక్రవారం వరకు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచానా వేసింది. దీంతో ముంయిలో ఆరెంట్ అలర్ట్ జారీ చేసింది. ఠాణె , పాల్ఘర్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఠాణెలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి గుంతల కారణంగా జారీ కింద పడ్డాడు.. ఆ సమయంలో అటు గా వచ్చిన బస్సు అతడిపై నుంచి వెళ్లడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి వర్షాలపై సమీక్ష నిర్వహించారు. వరదలతో ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.