మంగళగిరి ఎయిమ్స్ లో ఖాళీ పోస్టుల భర్తీకి కేంద్రం చర్యలు..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఎయిమ్స్ లో మొత్తం 534 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వినతులకు అనుగుణంగా ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి సహకరించిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, పార్టి అధ్యక్షుడు జెపి నడ్డాకు మంత్రి పెమ్మసాని కృతజ్ఞతలు తెలియజేశారు.