తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ (CLiC2NEWS): అగ్రవర్ణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో ఈబీసీలకు 10% రిజర్వేషన్ వర్తించనుంది. రూ. 8 లక్షల్లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఆదాయ ధ్రువపత్రం ఆధారంగా రిజర్వేషన్ అర్హతను గుర్తించనున్నట్లు స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ నియామకాల్లోనూ మహిళలకు 33% కోటా అమలు చేయనున్నారు.