Oscars 2021: ఉత్త‌మ చిత్రంగా నోమ్యాడ్ లాండ్‌

సినిమా రంగంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా చెప్పుకొనే అస్కార్ అవార్డుల ప్ర‌ధానోత్స‌వం అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ మూలంగా ప‌లుమార్లు వాయిదా ప‌డిన ఈ వేడుక ఎట్ట‌కేల‌కు ప్రారంభ‌మై (ఏప్రిల్ 25 అర్ధ‌రాత్రి) ఘ‌నంగా జ‌రుగుతోంది. ఈ సారి ఆన్‌లైన్‌లో నిర్వ‌హిస్తున్నారు.

అయితే 93వ అకాడమీ అవార్డ్ వేడుక‌లో `నోమాడ్ ల్యాండ్‌`కు ఉత్త‌మ ద‌ర్శ‌కులుగా ఆస్కార్ అవార్డ్ అందుకున్న తొలి మ‌హిళ‌గా చోలే జావో చరిత్ర సృష్టించారు. ది హర్ట్ లాకర్ దర్శకుడు కాథరిన్ బిగెలో తర్వాత ఆస్కార్ చరిత్రలో అవార్డును గెలుచుకున్న రెండవ మహిళ కూడా ఈమెనే.

ఉత్తమ దర్శకురాలు క్లోవీ చావ్‌

ఆస్కార్ విజేత‌లు..

  • ఉత్తమ చిత్రం: నోమ్యాడ్‌ ల్యాండ్‌
  • ఉత్తమ దర్శకురాలు: క్లోవీ చావ్‌ (నోమ్యాడ్‌ ల్యాండ్‌)
  • ఉత్తమ సహాయ నటుడు: డానియెల్‌ కలువోయా (జుడాస్‌ అండ్‌ ది బ్లాక్ మిస్సయా)
  • ఉత్తమ సహాయ నటి: యున్‌ యా జంగ్‌ (మినారి)
  • ఉత్తమ సౌండ్‌: సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌
  • ఉత్తమ సినిమాటోగ్రఫి: ఎరిక్‌ (మ్యాంక్‌)
  • ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ఎమరాల్డ్‌ ఫెన్నెల్ (ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌)
  • ఉత్తమ అడాప్టెడ్‌ స్ర్కీన్‌ప్లే: క్రిస్టోఫర్‌ హామ్టన్‌, ఫ్లొరియన్‌ జెల్లర్‌ (ది ఫాదర్‌)
  • ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: అనదర్‌ రౌండ్‌ (డెన్మార్క్‌)
  • ఉత్తమ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: సెర్హియోలోఫెజ్‌, మియానీల్‌, జమికా విల్సన్‌ (మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌)
  • ఉత్తమ క్యాస్టూమ్‌ డిజైన్‌: అన్‌రాత్‌ (మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్)
  • ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: మార్టిన్‌ డెస్మండ్‌ రాయ్‌ (టూ డిస్టెంట్ స్ట్రేంజర్స్)
  • ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌: మైకల్‌ గ్రోవియర్‌ (ఇఫ్‌ ఎనిథింగ్‌ హ్యాపెన్స్‌ ఐ లవ్‌ యూ)
  • ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: పీట్‌ డాక్టర్‌, దానా మరీ (సోల్‌)
  • ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌: అంథోనీ (కలెక్టివ్‌)
  • ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌: పిపా, జేమ్స్‌ రీడ్‌, క్రేగ్‌ ఫాస్టర్‌ (మై ఆక్టోపస్‌ టీచర్‌)
  • ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: ఆండ్రూ జాక్సన్‌, డేవిడ్‌ లీ (టెనెట్‌)
  • ఉత్తమ ప్రొడెక్షన్‌ డిజైన్‌: డోనాల్డ్‌ బర్ట్‌ (మ్యాంక్‌)

situs togel

Leave A Reply

Your email address will not be published.