సంధి వాతము (ఆస్టియో ఆర్థరైటిస్)

సంధి వాతము ఆస్టియో ఆర్థరైటిస్ (వయస్సుతో వచ్చే కీళ్ల జబ్బు)

వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్ల నొప్పులు రావడం సామాన్యం ఈ సమస్య స్త్రీలలో కొంచెం ఎక్కువగా కొందరు వయసుతో నిమిత్తం లేకుండా కూడా కనబడవచ్చు. ఈ కీళ్ల జబ్బు సంధి వాతం ముఖ్యంగా మోకాళ్ళ కీళ్లు, తుంటి కీళ్ళు, నడుము దగ్గర, మెడ దగ్గర కీళ్లనొప్పి ఉండటానికి కారణం కీళ్లల్లో ఉండే కార్టిలేజ్ దెబ్బతిని ఎముకలు గరుకుగా తయారవుతాయి. ఎముకల మధ్య ఉండే ఖాళీ ప్లేస్ తగ్గిపోతుంది. అందువలన కీళ్లు కదిలినప్పుడు గరగర అనే శబ్దం వస్తుంది. ఎముకలు దగ్గర ఉండే కండరాలు లింగమెంట్స్ గట్టిగా బిగుసుకుంటాయి. దీనినే సంధి వాతం అని ఆయుర్వేదంలో అంటారు. ఇది ఒక సర్వసాధారణమైన జబ్బు. ఇది వయసు మీద పడుతున్న వారందరికీ ఎక్కువగా వచ్చే సమస్య.

  • సందివాతం లక్షణాలు

1. కీళ్లలో విపరీతమైన నొప్పి
2. కీళ్లు పట్టడం
3. కాళ్ళు చాపాలన్న ,మడవాలన్న కూర్చోవాలన్న నొప్పి.
4. నొప్పితో పాటు కీళ్లలో నీరు చేరుతుంది.
5. ఎక్కువసేపు నడవలేము,నిలబడలేము,,నడిచినపుడు వంకటింకరగా నడవటం.
6. ఎత్తు పల్లాలు ఎక్కలేము.

  • కారణాలు

1. స్థూలకాయం
2., కీళ్లు అరగటం
3. హార్మోన్ల అసమతుల్యత.
4. లైఫ్ స్టైల్
5. ఆల్కహాల్ ఎక్కువ తాగటం
6. యూరిక్ యాసిడ్స్ పెరిగిపోవడము
7. అధిక వ్యాయామము,అధిక శ్రమ
8. డిప్రెషన్, దినచర్య, రాత్రి చర్యలు మార్పులు రావడం. నిద్ర సరిగ్గా లేకపోవటం. తిన్నది అరగక గ్యాస్ ఉత్పత్తి అవ్వటం.

  • చికిత్స విధానం

1. జీవనశైలిలో మార్పు
2. యోగా చికిత్స
3. ప్రాణాయామ, ధ్యాన చికిత్స
4. భౌతిక చికిత్స
5. ఆహార విహారాల్లో మార్పు చేయటం

ఉదయం గోరువెచ్చని నీళ్లు తాగాలి. కాల కృత్యములు తర్వాత వాకింగ్ గాని యోగ, ఆయిల్ మర్ధన చేయాలి. సరైనా సమయానికి ఆహారం మ‌రియు నిద్ర ఉండాలి. మలబద్ధకం లేకుండా చేసుకోవాలి. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో చక్కగా తీసుకోవాలి.

  • ఆహారం

1. కాల్షియంతో కూడినటువంటి డైటరీ పాల ఉత్పత్తులు తీసుకోవాలి
2. విటమిన్ సి తో కూడుకున్న ఆహారం తీసుకోవాలి.
3. భోజనంలో పీచు పదార్థాలు ఉన్న కాయగూరల్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది.
4. మునగాకు జ్యూస్, గోధుమ గడ్డి జ్యూస్, తిప్పతీగ జ్యూస్, మరియు అల్లం, పసుపు వెల్లిపాయని ఎక్కువగా మనం భోజనంలో తీసుకోవాలి.
5. మలబద్ధకం అయ్యే ఆహార పదార్థాలు మానివేసి జామకాయ, బొప్పాయి, క్యారెట్ పాలకూర, చుక్కకూర, కిస్మిస్, తీసుకోవాలి.
6. వయసుకు తగ్గట్టు ఆహార నియమాలు తీసుకోవాలి.
7. వయసుకు తగ్గట్టు బరువు ఉండాలి.
8. కీళ్ల నొప్పుల పై ఆయిల్ మసాజ్ చేసి దాని మీద గోరువెచ్చనీ నీటితో కాపు చేయాలి.
9. ఉదయం యోగాలోని సూక్ష్మ వ్యాయామము
10. తాడాసనము.
11. కటి చక్రాసనము.
12. అర్థ చక్రాసనము.
13. పవన ముక్తాసనము.
14. ఇంకా కొన్ని ఆసనాలు మరియు ప్రాణాయామం చేయాలి.

  • ఆయుర్వేద మందులు

యోగ రాజు గుగ్గులు
మహా యోగరాజ గుగ్గులు
బృహత్ వాత చింతామణి రస్
పునర్నవ మండూర్
మహా రస్నాదికాడ
మహా నారాయణ తైలం.
డాక్టర్ సలహా మేరకు వాడవలెను.

-వైద్య షేక్ బహార్ అలీ
ఆయుర్వేద వైద్యులు


Leave A Reply

Your email address will not be published.