ఓటిఎస్ అనేది పూర్తి స్వచ్ఛందం: సిఎం జగన్

అమరావతి(CLiC2NEWS): గృహ నిర్మాణం, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఒటిఎస్) పథకంపై ఎపి సిఎం జగన్ బుధవారం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. ఒటిఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఒటిఎస్ పూర్తిగా స్వచ్ఛందం అని స్పష్టం చేశారు. వారికి పూర్తి హక్కులు వస్తాయని తెలిపారు. రుణాలు మాఫీ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. వాటిని అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చు లేదా అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని వెల్లడించారు. పేదలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ మేలు చేస్తామని, ముందు ముందు గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతాయని, అవకాశాలను వాడుకోవాల== లేదా== అన్నది వారిష్టమేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీరంగనాథరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.