చెరువులు ఆక్రమించిన వారి భరతం పడతాం: సిఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): కొందరు శ్రీమంతులు విలాసాల కోసం చెరువుల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించారని, చెరువులు ఆక్రమించిన వారి భరతం పడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హరేకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత శేష స్థాపన ఉత్సవంలో పాల్గొన్నా సిఎం.. శ్రీకృష్ణుడి భగవద్గీత బోధనానుసారం చెరువులను కాపాడుతున్నామన్నారు. అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న కృష్ణుడి మాటలు తనక స్ఫూర్తి అన్నారు.
ప్రకృతి సంవదను విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుందని.. చెరువులను చెరబట్టిన వాళ్ల నుండి విముక్తి చేయాలనుకున్నామన్నారు. ఎంత ఒత్తిడి ఉన్న వెనక్క తగ్గకుండా అక్రమ నిర్మాణాలు కూలగొడుతున్నామన్నారు. చెరువులు మన జీవనాధారం , సంస్కృతి.. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సిఎం అన్నారు.
కొందరు శ్రీమంతులు విలాసాల కోసం చెరువుల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించారని , వాటి నుండి వచ్చే డ్రైనేజి నీరు చెరువుల్లో కలుపుతున్నారన్నారు. చెరువులు అక్రమించిన వారి భరతం పడతామని, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని సిఎం తెలిపారు.